వినూత్న గెటప్ లో రజనీకాంత్
- December 28, 2015
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిలే వేరు. వినూత్న గెటప్ లు, తనదైన స్టయిల్ తో అభిమానులకు కనువిందు చేస్తుంటాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రోబో సీక్వెల్ రోబో 2 చిత్రంలో రజనీకాంత్ సరికొత్తగా కనిపించనున్నారు.ఈ చిత్రంలో రజనీకాంత్ కు ఫ్యాషన్ డిజైనర్ రాకీ కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు. రోబో 2 సెట్స్ పై రజనీకాంత్ తో దిగిన ఫొటోను రాకీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో రజనీకాంత్ గళ్ల చొక్కా, జాకెట్ ధరించి.. చిన్న గడ్డం, మాంచి హెయిర్ స్టయిల్ తో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.శంకర్ దర్శకత్వంలోనే రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్ జంటగా నటించిన సైంటిఫిక్ మూవీ రోబో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా రోబో 2 లో ఐశ్వర్యా రాయ్ బదులు ఎమీ జాక్సన్ రజనీ కాంత్ సరసన నటిస్తోంది. భారత చిత్ర పరిశ్రమలోనే 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







