ఎలక్షన్‌ షెడ్యూల్‌కు ముహూర్తం ఖరారు

- February 23, 2019 , by Maagulf
ఎలక్షన్‌ షెడ్యూల్‌కు ముహూర్తం ఖరారు

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు రెడీ అవుతోంది ఎన్నికల సంఘం. షెడ్యూల్‌ ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 7 నుంచి 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జూన్‌ 3వ తేదీన 16వ లోక్‌సభ పదవీ కాలం ముగియనుంది. దీంతో షెడ్యూల్‌ను రిలీజ్‌ చేసేందుకు సమాయత్తమవుతోంది ఎన్నికల సంఘం.

 
అటు… ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల పదవికాలం కూడా ముగుస్తోంది. దీంతో లోక్‌సభతో పాటు ఈ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇదే సమయంలో… అటు రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. సాధ్యమైనంత త్వరగా..ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది ఈసీ.

ఈ సారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో …. 22.3 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్‌ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్‌ యంత్రాలు అవసరమవుతాయని ఈసీ ఇప్పటికే తేల్చింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ మేరకు యంత్రాంగం సిద్దంగా ఉందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు.

మరోవైపు… మార్చి 6న కేంద్ర కేబినెట్‌ చివరి సమావేశం ఉండే అవకాశం ఉంది. అదే రోజున కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో ప్రదాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 లోగా ఎన్నికలకు సంబంధించిన బాధ్యులుగా ఉండే అధికారుల బదిలీలను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో… ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్ కాస్త ఆలస్యం కావచ్చన్న వాదన ప్రచారంలో ఉంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతికారం తీర్చుకోవాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో.. దానికి తగ్గుట్టుగా . షెడ్యూల్ విడుదల చేస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు ఎన్నికల సంఘం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com