ఫిబ్రవరి 25న ఆస్కార్ అవార్డుల పండగ
- February 23, 2019
సినిమా రంగంలో ఆస్కార్ కు ఉన్నంత విశిష్టత మరే పురస్కారానికి లేదంటూ అతిశయోక్తి కాదు. హాలీవుడ్ సినిమా పండగగా అభివర్ణించే ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచ దేశాలన్నీ అమితమైన ఆసక్తితో ఎదురుచూస్తుంటాయి. జీవితంలో ఒక్కసారన్నా ఆస్కార్ అవార్డు అందుకుంటే ఇంక సాధించాల్సిందేమీ ఉండదని సినీ ప్రముఖులు భావిస్తుంటారు. సినీ అవార్డుల్లో ఎవరెస్ట్ లాంటి ఆస్కార్ పురస్కారోత్సవం ఇప్పుడు మళ్లీ వచ్చింది. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 25న 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. ఈ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రతి ఏటా హాలీవుడ్ లో ప్రదానం చేస్తుంది. ఈసారి ఉత్తమచిత్రం రేసులో బ్లాక్ పాంథర్, వైస్, రోమా, బొహేమియన్ రాప్సొడీ, ఏ స్టార్ ఈజ్ బోర్న్ తదితర చిత్రాలు నిలిచాయి. ఉత్తమ నటుడి అవార్డు కోసం క్రిస్టియన్ బేల్, బ్రాడ్లీ కూపర్, విలెమ్ డాఫో, రామి మాలెక్, విగ్గో మార్టెన్సమ్ పోటీపడుతున్నారు. హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ ఈసారి అవార్డుల కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది. మొత్తం 24 కేటగిరీల్లో 52 సినిమాలు బరిలో నిలిచాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..