బహ్రెయిన్‌ అభివృద్ధిలో బిసిసిఐ పాత్ర

- December 28, 2015 , by Maagulf
బహ్రెయిన్‌ అభివృద్ధిలో బిసిసిఐ పాత్ర


బహ్రెయిన్‌ ఆర్థిక అభివృద్ధిలో బిసిసిఐ పాత్ర ఎంతో ఉందని బహ్రెయిన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మరియు ఇండస్ట్రీ పునరుద్ఘాటించింది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం ఛాంబర్‌ కృషి చేస్తుందని ప్రతినిథులు వెల్లడించారు. ఛాంబర్‌ ఏ ఒక్కరికో కొమ్ము కాయడం అనేది జరగదని వారు చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ఛాంబర్‌, సభ్యుల సూచన మేరకు పనిచేస్తుందని ప్రతినిథులు వివరించారు. ఎంటర్‌ప్రెన్యూర్‌కమిటీలు ఏర్పాటు చేసి చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్‌ వృద్ధి కోసం కృషి చేస్తుందని ఛాంబర్‌ తెలిపింది. బైట్‌ అల్టిజార్‌ పేరుకి తగ్గట్టుగానే ఛాంబర్‌ పనితీరు ఉంటుందని ఛాంబర్‌ ప్రతినిథులు స్పష్టం చేయడం జరిగింది. పారిశ్రామిక వృద్ధి, తద్వారా దేశ ప్రగతిలో బిసిసిఐ తన వంతు బాధ్యత నిర్వహిస్తుందని బిసిసిఐ వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com