దీన స్థితిలో హీరోయిన్ విజయలక్ష్మి
- February 25, 2019
ఓ పక్క ఆర్థిక ఇబ్బందులు, మరో పక్క అనారోగ్యం. తమిళ, కన్నడ రంగల్లో యువతారగా గుర్తింపు తెచ్చుకున్న విజయలక్ష్మి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది. బెంగళూరులోని మాల్యా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతోంది. విజయలక్ష్మి గతంలో తమిళ్ సూపర్ స్టార్ సూర్యతో కలిసి ప్రెండ్స్ అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ తరువాత హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో సహాయ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాుతోంది. జీవనోపాధి కోసం టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించేది. విజయలక్ష్మి తమిళ, కన్నడ చిత్రాల్లోనే కాదు, మలయాళం, తెలుగు భాషల్లోనూ నటించింది. నాగమండ, జోడిహకి, సూర్యవంశం వంటి చిత్రాల్లో ఆమె నటనకు గాను మంచి గుర్తింపు వచ్చింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం ఆదుకోమంటూ ఇండస్ట్రీని కోరుతోంది విజయలక్ష్మి సోదరి ఉషాదేవి.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా