దర్శకురాలు అనుమానాస్పద మృతి
- February 25, 2019
కేరళకు చెందిన యువ దర్శకురాలు నయన సూర్యన్ అనుమానాస్సద స్థితిలో మృతి చెందారు. సినిమాలపై ఉన్న అసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన
ఆమె పలు చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. రెండేళ్ల క్రితం ‘క్రాస్‌వర్డ్’ అనే సినిమా ద్వారా మాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు.సినిమాల్లోకి రాకముందు.
నయన నాటక రంగంలో పనిచేశారు. అలాగే పలు ప్రకటనలను కూడా రూపోందించారు.
కాగా ఆదివారం రాత్రి ఆమె తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. అమె మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం నయన తల్లి ఆమెకు ఫోన్ చేయగా ఎంతకు ఎత్తలేదు. దీంతో ఆమె ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమె స్నేహితులకి ఫోన్ చేశారు. ఈ క్రమంలో వారు తిరువనంతపురులోని ఆమె ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా.. ఆమె విగితా జీవిగా పడివు్న్నారు. ఈ విషయంపై ఆమె స్నేహితురాలు మీడియాతో మాట్లాడారు. నయన గత కొంతకాలంగా డయాబెటిస్తో బాధ పడుతున్నట్లు తెలిపారు. అలాగే కొద్దిరోజుల క్రితం మృతి చెందిన డైరెక్టర్ లెనిన్ రాజేంద్రన్ ఆమెకు గురువు. అతని దగ్గర నయన దర్శకత్వ మెళకువలను నేర్చుకున్నారు. రాజేంద్రన్ ఆకస్మిక మృతి తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్వక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక అనంతరం నిజానిజాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్వాప్తులో ఉందని పూర్తి విచారణ తర్వాత మృతి గల కారణాలను వెల్లడిస్తామన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా