డ్రగ్ డీలర్‌కి జీవిత ఖైదు, 50,000 దిర్హామ్‌ల జరీమానా
- February 26, 2019
నార్కోటిక్ డ్రగ్స్‌ని సేవించడం, విక్రయిస్తుండడం వంటి అభియోగాలపై ఓ వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. సుప్రీం ఫెడరల్ కోర్ట్ - అబు దాబీ, కింది కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించిది. నిందితుడు అరబ్ జాతీయుడు. మరిజువానా సహా పలు రకాలైన డ్రగ్స్‌ని నిందితుడు అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. అయితే నిందితుడు, తాను డ్రగ్స్ తీసుకున్న మాట వాస్తవమేగానీ, వాటిని సొంత వాడకం కోసం ఉపయోగించాను తప్ప, ఎవరికీ విక్రయించలేదని అంటున్నాడు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుని టాప్ కోర్ట్‌లో నిందితుడు సవాల్ చేయగా, అక్కడా అతనికి చుక్కెదురయ్యింది. స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్‌ని ధ్వంసం చేయాలనీ, అలాగే లీగల్ పీజుల్ని కూడా నిందితుడి నుంచి వసూలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..