దేశవ్యాప్తంగా హైఅలర్ట్: ఉగ్రదాడులు జరగవచ్చు - ఐబీ వార్నింగ్
- February 26, 2019
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టుల క్యాంపులపై బాంబుల వర్షం కురిపించారు. ముష్కరమూకల శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు 300మంది టెర్రరిస్టులను హతమార్చారు. వాయుసేన దాడుల్లో జైషే మహమ్మద్ సీనియర్ కమాండర్లు, టెర్రరిస్టులు, ట్రైనీలు ఇతర జిహాదీలు పెద్ద సంఖ్యలో చనిపోయినట్టు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. భారత వాయుసేన మెరుపు దాడితో ఉగ్రవాదులకు గట్టి దెబ్బ తగిలింది.
ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడుల తర్వాత దేశవ్యాప్తంగా హైఅలర్ట్ విధించారు. ఉగ్రమూకలు భారత్‌పై విరుచుకుపడొచ్చని నిఘా వర్గాల హెచ్చరించాయి. టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్న నగరాలు అప్రమత్తంగా ఉండాలని ఐబీ చెప్పింది. అన్ని రాష్ట్రాల డీజీపీలను అలర్ట్ చేసింది. ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. భారత సరిహద్దుల్లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు. నేవీ కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తం అయ్యంది. గస్తీని ముమ్మరం చేసింది. ఎయిర్ స్ట్రైక్స్ గురించి భారత విదేశాంగ శాఖ ప్రపంచ దేశాలకు వివరించింది. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, యూకే ప్రతినిధులకు ఎయిర్ స్ట్రైక్స్ గురించి తెలిపారు.
ఫిబ్రవరి 14వ తేదీ పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. జవాన్లను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్ ప్రేరేపిత జేషే మహమ్మద్ ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీ నిర్ణయించుకుంది. సమయం కోసం వేచి చూసింది. పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత అదను చూసి భారత వాయుసేన దెబ్బకొట్టింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలతో వెయ్యి కిలోల బాంబులతో టెర్రిస్టుల క్యాంపులపై విరుచుకుపడింది. ఉగ్రవాదుల క్యాంపులను నామరూపాలు లేకుండా చేసింది.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







