గాంధీ శాంతి బహుమతుల ప్రదానం
- February 26, 2019
న్యూఢిల్లీ: గాంధీ శాంతి బహుమతుల ప్రదానం నేడు జరిగింది. 2015, 2016, 2017, 2018 సంవత్సరానికిగాను గ్రహీతలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 2015కు గాను కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్ర, 2016కు గాను అక్షయ పాత్ర ఫౌండేషన్ అండ్ సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా, 2017కు గాను ఎకల్ అభియాన్ ట్రస్ట్ అదేవిధంగా 2018కు గాను యోహియ్ ససాకవాలు అవార్డుకు ఎంపికయ్యారు. అహింసా పద్ధతిలో, గాంధీయుత మార్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు కృషిచేసిన వ్యక్తులు, సంస్థలకు భారత ప్రభుత్వం ప్రతి ఏడాది గాంధీ శాంతి బహుమతిని అందజేస్తుంది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







