అబుధాబీ ఓఐసీలో పాకిస్తున్‌ను దులిపేసిన సుష్మాస్వరాజ్
- March 01, 2019
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ (ఓఐసీ) కో-ఆపరేషన్ సదస్సులో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ పేరు ఎత్తకుండా ఆ దేశంపై నిప్పులు చెరిగారు. ఆమె పుల్వామా ఘటనను లేవనెత్తారు. పాక్ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. అరబ్ దేశాలతో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తీవ్రవాదానికి మతం లేదని చెప్పారు. ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ దోషి అని తేలిందన్నారు.
ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనే అన్ని దేశాలు కలిసి రావాలని చెప్పారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవాలని చెప్పారు. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ఓఐసీ సదస్సుకు సుష్మా విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఓఐసీకి భారత్‌ను ఆహ్వానించడంతో సమావేశానికి పాకిస్తాన్ డుమ్మా కొట్టింది.
ఉగ్రవాదం అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోందని, దేశాలను నాశనం చేస్తోందని సుష్మా అన్నారు. 130 కోట్ల మంది భారతీయుల అభినందనలు, ప్రత్యేకంగా 185 మిలియన్ల ముస్లిం సోదర సోదరీమణుల శుభాకాంక్షలు ఇక్కడికి తీసుకొచ్చానని తెలిపారు. శాంతికి దారి చూపే మార్గంగా భారత్ ఉందని, తమ దేశంలో ఎన్నో మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ప్రపంచంలోని భిన్నమైన దేశాల్లో భారత్ ఒకటి అని, అన్ని మతాల ప్రజలు సోదరభావంతో ఎంతో సామరస్యంగా కలిసిమెలిసి ఉంటారని, ఎలా కలిసి ఉండాలో భారత్ ప్రజలకు తెలుసునన్నారు.
ఉగ్రవాదం పెరుగుతోందని, దానిని నిలువరించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం కారణంగా ఎన్నో దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓఐసీ చేసే పోరాటానికి భారత్ మద్దతు ఇస్తోందని చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ ఆర్థిక సాయం చేయడం వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉగ్రవాదం బాగా పెరుగుతోందని చెప్పారు. వాళ్లు చేస్తున్న దారుణాల వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో అందరం చూస్తున్నామన్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు వెంటనే దాన్ని నిలిపివేయాలన్నారు.
అందరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. తీవ్రవాదం పేరుతో మతాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పారు. మన పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉండాలని, మతానికి వ్యతిరేకంగా కాదని, ఇస్లాం ధర్మం శాంతి, అల్లాకు ఉన్న 99 పేర్లలో ఎందులోనూ హింస అర్థం లేదని, అలాగే ప్రతి మతంలో శాంతి, సోదరభావం ఉన్నాయని, భారత్ ఎల్లప్పుడూ బహుళత్వాన్ని అనుసరిస్తుందని, రుగ్వేదం ప్రకారం దేవుడు ఒక్కడే కానీ ఆయనను ప్రజలు రకరకాలుగా పూజిస్తారని ఆమె చెప్పారు.
శాంతికి ప్రతిరూపమైన మహాత్మాగాంధీ నడయాడిన ప్రదేశం నుంచి నేను వచ్చానని, అక్కడ ప్రతి ప్రార్థనా శాంతి అనే పదం ఉచ్చరించిన తర్వాతే ముగుస్తుందని సుష్మా స్వరాజ్ చెప్పారు. స్థిరత్వం, శాంతి, సామరస్యం, ఆర్థిక పురోగతి, ప్రజల అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు భారత్ నుంచి అభినందనలు తెలుపుతున్నామన్నారు. మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. మానవత్వాన్ని కాపాడాలనుకుంటే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం నిలిపివేయాలని సుష్మా డిమాండ్ చేశారు. యుద్ధం, ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రమే ఉగ్రవాదంపై విజయం సాధించలేమన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







