అతని గురించి సమాచారం ఇస్తే..మిలియన్ డాలర్ల బహుమతి
- March 01, 2019
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ అధినేత బిన్ లాడెన్ కుమారుడి ఆచూకి అందించిన వారికి బహుమతి ఇస్తామంటూ అమెరికా ప్రకటించింది. బిన్ లాడెన్ కొడుకు హమ్జాబిన్ లాడెన్ గురించి సమాచారం అందిస్తే ఒక మిలియన్ డాలర్లను ఇస్తామంటూ వెల్లడించింది. అయితే అతడు పాకిస్థాన్, అఫ్గనిస్తాన్, ఇరాన్, సిరియా దేశాల్లో ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. బిన్ లాడెన్ ను అమెరికా దళాలు హతమార్చిన తర్వాత అల్ ఖైదాకు హమ్జాబిన్ నాయకత్వం వహిస్తున్నాడు. సిరియా అంతర్యుద్ధం పాలస్తీనా స్వేచ్ఛకు దారితీస్తుందని, జిహాదీలు ఐక్యంగా ఉండాలంటూ హమ్జా 2015లో ఓ వీడియో విడుదల చేశాడు. తండ్రిని చంపినందుకు అతడు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండటంతో ….అతన్ని పట్టుకునేందుకు భారీ నగదును బహుమతిని ప్రకటించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







