కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన 'సెబీ'
- March 01, 2019
భారత స్టాక్ మార్కెట్ను మరింత బలోపేతం చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా బ్రోకర్లు, స్టాక్ ఎక్స్ఛేంజ్లు, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు వేచి చూస్తున్న కంపెనీల నుంచి వసూలు చేస్తున్న ఫీజులను తగ్గించేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా అంకురాలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు కొత్త నియమాలను తీసుకువచ్చింది. ఈ కొత్త నియమాల వల్ల అంకురాలల్లో పెట్టబడిదారులు మదుపు చేసేందుకు దోహదపడుతుందని, అది అంకురాల నిధుల సమీకరణకు ఉపయోగపడుతుందని 'సెబీ' అభిప్రాయపడింది.
కొన్ని వరస సమావేశాల అనంతరం కార్పొరేట్లు ఎదుర్కొంటున్న రుణ పునరుద్ధరణ సమస్యలపై కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. రుణ పునరుద్ధరణకు ప్రత్యేక కేసులుగా భావిస్తున్న కొన్ని కంపెనీలకు మినహాయింపు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు స్టాక్ మార్కెట్లల్లో లిస్ట్(నమోదు) అయ్యేందుకు నియమాలను సరళీకృతం చేసినట్టు వెల్లడించింది. అంతేకాకుండా కమొడిటీ డెరివేటీవ్స్లో ట్రేడ్ చేయటానికి మ్యూచువల్ ఫండ్లు, ఫోర్ట్పోలియో ఇన్వెస్టర్లను అనుమతిస్తున్నట్లు వివరించింది. సెబీ తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభినందనలు తెలిపారని సెబీ తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







