పొట్టి రాంబాబు మరణించారు..
- December 28, 2015
టాలీవుడ్ లో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈశ్వర్ సినిమాతో కామెడియన్ గా పరిచయం అయిన నటుడు పొట్టి రాంబాబు(35) ఈ రోజు(మంగళవారం) ఉదయం మరణించారు. దాదాపు 40కి పైగా సినిమాలో నటించిన రాంబాబు ఈశ్వర్, క్లాస్ రూమ్, చంటిగాడు, కథానాయకుడు, దొంగా దొంగది, అస్త్రం, ప్రేమతో నువ్వు వస్తావని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.చాలా మంది కామెడియన్ లు హీరోలుగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నేపధ్యంలో ఇటీవల పులిరాజా ఐపియస్ పేరుతో హీరోగా మారే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మెదడులో రక్తం గడ్డకట్టి స్ట్రోక్ రావటంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. రాంబాబుకు భార్య ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు.రాజమండ్రి దగ్గర బూరుగుపూడి ఆయన స్వగ్రామం. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ చాలా మంది హాస్యనటులను కోల్పోగా అదే వరసలో పొట్టి రాంబాబు కూడా తెలుగు సినీ అభిమానులకు దూరమయ్యారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







