వీసాలిప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు..
- December 28, 2015
కెనడా... న్యూజిలాండ్... ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకునే వారికి వీసాలిప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు గొల్లుమన్నారు. పంజాగుట్ట ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... కోల్‌కత్తాకు చెందిన శ్యాంబాయి, హెచ్. సవాలియా పంజాగుట్ట జర్నలిస్టు కాలనీలో త్రినేత్ర మేనేజ్‌మెంట్ పేరుతో ఓ వీసా అకామిడేషన్ సంస్థను ప్రారంభించారు. అందులో విమాన టికెట్లు, స్టూడెంట్ వీసా, వర్క్ పర్మిట్ వీసా, పాస్‌పోర్టు అసెస్‌మెంట్ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామని, కోల్‌కత్తా, రాయిపూర్, ఢిల్లీల్లో తమ శాఖలున్నాయని నమ్మబలికారు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు భారీ సంఖ్యలో విదేశాల్లో స్థిరపడాలనే ఆశతో ఒక్కొక్కరూ రూ.50వేల నుంచి రూ.60వేల చొప్పున 300 మంది బాధితులు కోటి రూపాయలకు పైగా ఆ సంస్థకు సమర్పించుకున్నారు. కోట్లాది రూపాయలు చేతికందటంతో ఎవరికీ చెప్పకుండా బోర్డు తిప్పేశారు. దీంతో తాము మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను అదుపులోకి తీసుకొని వారి పాత్రపై విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు 150 మంది విద్యార్థ్ధులు, యువకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







