కొత్త జనరేషన్ స్కూల్స్ కోసం 1.5 బిలియన్ దిర్హామ్‌లు
- March 05, 2019
న్యూ జనరేషన్ - ఎమిరేటీ స్కూల్స్ కోసం 1.5 బిలియన్ దిర్హామ్‌లు కేటాయించినట్లు వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు. డిజైన్ లేబోరేటరీస్, రోబోట్స్, ఆర్టిఫీషియల్, ఇంటెలిజెన్స్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ లేబరేటరీస్ మరియు స్పెషల్ స్పోర్ట్ ఫెసిలిటీస్ కోసం ఈ నిధులు వెచ్చిస్తారు. కొత్త జనరేషన్ కోసం కొత్త ఆలోచనలు తప్పనిసరి అని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు. రానున్న 50 ఏళ్ళలో సరికొత్త ఆలోచనల దిశగా ముందడుగు వేయాల్సి వుంటుందని, అదే మనం తదుపరి జనరేషన్‌కి ఇచ్చే బహుమతి అని మరో ట్వీట్లో షేక్ మొహమ్మద్ చెప్పారు. కాగా, యూఏఈ వ్రైస్ ప్రెసిడెంట్, 100 మిలియన్ దిర్హామ్‌ల ఫండన్ని, 65,000 మంది స్టూడెంట్స్‌కి సంబంధించి కెరీర్ పాత్స్ డెవలప్మెంట్, బిజినెస్ ఓరియెంటెడ్ మైండ్స్ వంటి విభాగాల్లో ఖర్చు చేసేందుకోసం కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లాజిస్టిక్స్, ఆయిల్ మరియు గ్యాస్, రిటెయిల్ సెక్టార్లలో యువత ఆలోచనలు ఇందులో భాగం.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







