శివుడు సృష్టి ఆదియోగి..యోగశాస్త్ర సృష్టికర్త
- March 05, 2019
ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు కోయంబత్తూరులో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీంతో వెల్లంగిరి కొండలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. ఈ వేడుకల్లో దేశ, విదేశాలకు చెందిన భక్తులు భారీగా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి.
లయకారుడైన శివుడు సృష్టికే ఆదియోగి. ఆయన నుంచే యోగశాస్త్రం ఆవిర్భవించింది. దేశంలోని ప్రముఖ యోగ, ధ్యాన కేంద్రమైన ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఎప్పటిలా ఈసారి కూడా అత్యంత వైభవంగా, విలక్షణంగా నిర్వహించారు. భక్తిని, యోగ ధ్యానాలతో మిళితం చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించింది.
ఈశా ఫౌండేషన్ 1994 మార్చి నుంచి ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. శూన్యంలో నుంచి పుట్టి శూన్యంలో విలీనమవ్వడమన్న ఆధ్యాత్మిక చింతనను మహా శివరాత్రి వేడుకల్లో ప్రధానంగా వివరించారు. ఈ ఏడాది సద్గురు జెగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..