మంటల్లో అక్షయ్ కుమార్
- March 06, 2019
సాధారణంగా స్టార్ హీరోల సినిమా స్టంట్స్ చూస్తుంటాం. అయితే సినిమాల్లో రిస్కీ స్టంట్స్ చేసేప్పుడు వారు డూప్స్ ద్వారా షూట్ చేస్తుంటారు. కానీ రియల్‌గా ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ స్టెంట్ చేసి ఆశ్చర్యపరిచారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ఓ వేదికపై తన సూట్‌కి నిప్పంటించుకొని మంటల్లో కాలిపోతూ కనిపించారు అక్షయ్. తన తాజా వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ ఈ రిస్కీ స్టంట్ చేశారు.
ఓ వైపు తన సినిమాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారితో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. 'ది ఎండ్' అనే పేరుతో ఈ వెబ్ సీరీస్ తెరకెక్కుతోంది. అయితే ఈ వెబ్ సీరీస్ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మంటల్లో కాలిపోతూ స్టేజ్ పైకి వచ్చారు అక్షయ్. ఈ మేరకు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. ఇది కేవలం ఆరంభమే అని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..