బాత్రూంలోకి ఈడ్చుకెళ్లి హింసించాడు..భర్తపై నటి ఫిర్యాదు..
- March 06, 2019
తాజాగా ప్రముఖ నటి అదితి సోదరి అర్జూ గోవిత్రికర్ వార్తల్లో నిలిచారు. పలు టివి సీరియల్స్‌లో నటించి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జూ భర్తతో వచ్చిన విభేదాల కారణంగా పోలీస్ స్టెషన్ మెట్లు ఎక్కింది. భర్తపై గృహహింస కేసు పెట్టింది. ఆమె భర్త సిద్దార్థ్ సబర్వాల్‌పై సాక్ష్యాధారాలతో సహా ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మద్యం సేవించి ఎనిమిదేళ్లుగా సిద్దార్థ్ తనను హింసకు గురిచేస్తున్నాడని కంప్లెట్‌లో పేర్కొంది.
తన భర్త వేధింపులు భరించలేక అతని నుంచి దూరంగా వర్లీలోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నట్లు తెలిపింది.అతని దూరంగా ఉన్న కూడా తరుచూ ఇంటికి వచ్చి వేధిస్తున్నాడని తన కుమారుడిని తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడని విచారం వ్యక్తం చేసింది. సిద్ధార్థ్ శారీరక దాడికి పాల్పడుతున్న పమయంలో తీసిన వీడియోను అర్జూ పోలీసులకు ఇచ్చింది. ఆ వీడియోలోని దృశ్యాలు స్పష్టంగా లేవు. కానీ అర్జూని సిద్దార్థ్ చెంపదెబ్బ కొట్టి బాత్రుంలోకి ఈడ్చుకెళుతున్న దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఫిబ్రవరి 15న జరిగినట్లుగా అర్జూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నటి అదితి గోవిత్రికర్ సోదరే అర్జూ. అదితి తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర్రంలో నటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..