ఇండియన్‌ హైస్కూల్‌ సీఈఓకి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌

- March 07, 2019 , by Maagulf
ఇండియన్‌ హైస్కూల్‌ సీఈఓకి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌

దుబాయ్: 2019 జిఇఎస్‌ఎస్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఇండియన్‌ హైస్కూల్‌ దుబాయ్‌ సీఈఓ డాక్టర్‌ అశోక్‌కుమార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్నారు. తాలీమ్‌తో కలిసి ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఎడ్యుకేషన్‌ విభాగంలో 30 ఏళ్ళ అనుభవం కలిగిన డాక్టర్‌ కుమార్‌ని, న్యాయ నిర్ణేతలు లీడర్‌గా గుర్తించారు. పలు గ్రూప్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ని విజయవంతంగా నిర్వహిస్తున్న అశోక్‌కుమార్‌పై ప్రశంసల వర్షం కురిసింది. తాలీమ్‌ సీఈఓ రాస్‌ మార్షల్‌ మాట్లాడుతూ, డాక్టర్‌ కుమార్‌ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అనీ, ఇండియన్‌ హైస్కూల్‌ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళారని చెప్పారు. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆయన సాధించిన పేరు ప్రఖ్యాతులు అమోఘమని అన్నారు. 2001లో భారత కేంద్ర విద్యా శాఖ మంత్రి మురళీ మనోహర్‌ జోషీ చేతుల మీదుగా బెస్ట్‌ ప్రిన్సిపల్‌ జాతీయ అవార్డుని అందుకున్నారు. యూఏఈలో షేక్‌ హమదాన్‌ అవార్డుని కూడా అందుకున్నారాయన.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com