భారతీయ వ్యక్తికి అండగా నిలిచిన యూఏఈ పోలీస్
- March 08, 2019
అజ్మన్ పోలీస్ కమ్యూనిటీ సపోర్ట్ సెంటర్, 60 ఏళ్ళ భారతీయ వ్యాపారవేత్తను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ, అనారోగ్య సమస్యలకు గురైన ఆ వ్యక్తికి పోలీసులు అండదండలందిస్తున్నారు. సెంటర్ డైరెక్టర్ కెప్టెన్ వాఫా ఖాలిద్ అల్ హౌసాని మాట్లాడుతూ, బాధిత వ్యక్తిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బాధితుడు యూఏఈలో 35 ఏళ్ళుగా నివసిస్తున్నారు. అజ్మన్ అలాగే ఇతర ఎమిరేట్స్‌లో తన వ్యాపార కార్యకలాపాల్ని విస్తరించారు. అయితే అనుకోని కారణాలతో ఆస్తిని కోల్పోయి, తీవ్రమైన ఒత్తిడికి గురై, పెరాలసిస్‌తో బాధపడుతున్నారు. ఖలీఫా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతనికి సాయంగా ఎ వరూ లేకుండా పోయారు. అజ్మన్‌లో ఇండియన్ కాన్సులేట్‌ని సంప్రదించి, అతన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..