మహిళకు వందనం.. గూగుల్ స్పెషల్ ట్రీట్
- March 08, 2019
ఆమె వేరు, అతడు వేరు.. కాదు కాదు ఇద్దరూ ఒక్కటే. అసమానతలున్నచోట సమానత్వం కోసం గొంతు విప్పుతోంది. సాధికారత కోసం ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెర్చ్ ఇంజన్ గూగుల్ ‘ఆమె’కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ప్రత్యేక డూడుల్‌ను పెట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునే ప్రముఖ భాషలను తీసుకుని ఆయా భాషల్లో మహిళలను ఏమంటారో వివరిస్తూ డూడుల్‌ను ఏర్పాటు చేసింది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూతో కలిపి మొత్తం 11 భాషల్లో మహిళ పేరుని ప్రస్తావించింది. అంతే కాకుండా (GOOGLE) స్పెల్లింగ్‌లో రెండు ‘O’ వద్ద క్లిక్ బటన్ని చూపిస్తోంది. దీన్ని క్లిక్ చేస్తే మహిళలకు సంబంధించి ప్రముఖ రచయితలు, సెలబ్రిటీలు చెప్పిన కొటేషన్స్‌ను చూపిస్తుంది.
వీటిలో రష్యన్, ఫ్రాన్స్, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ నవలా రచయితల కొటేషన్స్‌ను చూపించింది. మహిళలను ఉద్దేశించి ఇండియన్ బాక్సర్ మేరికోమ్ ఇచ్చిన కొటేషన్‌ను కూడా పబ్లిష్ చేసింది. ప్రత్యేక సందర్భాల సమయంలో సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇలా స్పెషల్ డూడుల్స్‌ని పెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..