మెక్సికో:నైట్‌క్లబ్ కాల్పుల్లో 15 మంది మృతి
- March 10, 2019
మెక్సికో: మెక్సికోలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని సలమాంకాలో ఉన్న నైట్‌క్లబ్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. సలమాంకాలో రాష్ట్ర ఇంధన కంపెనీ పెట్రోలియస్ మెక్సికనోస్‌కు చెందిన మెయిన్ పైప్‌లైన్ ఉన్నది. ఈ పైప్‌లైన్ నుంచి కొందరు దుండగులు గత ఐదేండ్ల నుంచి భారీగా ఇంధన చోరీకి పాల్పడుతున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు శనివారం గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో నైట్‌క్లబ్‌లో కాల్పులు జరిగాయి. పోలీసులు మాట్లాడుతూ భారీగా ఆయుధాలు కలిగిన దుండగులు కాల్పులకు తెగబడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. దొంగలు ఐదేండ్ల కాలంలో రూ.21000 కోట్ల విలువైన ఇంధనాన్ని చోరీ చేశారని వివరించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







