కళ్యాణ్ రామ్ 'తుగ్లక్' సినిమా ఫిక్స్
- March 10, 2019
118 విజయంతో మళ్లీ జోష్ వచ్చింది కళ్యాణ్ రామ్ కు. చకచకా కథలు వింటున్నారు. 118 విడుదలకు ముందే కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్ చెప్పిన కథకు ఇప్పుడు ఓకె చెప్పేసారు. సోషియో ఫాంటసీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో తుగ్లక్ రీ బర్త్ లేదా రీ ఎంట్రీ లాంటి అంశం మిళితమై వుంటుంది.
ఆద్యంతం ఫన్ ప్లస్ కమర్షియల్ మీటర్ వుండే ఈ సినిమాను తన సొంత బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ నే నిర్మిస్తారు. ఈ నెలలోనే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టే అవకాశం వుంది. సినిమాకు మిగిలిన స్టార్ కాస్ట్, టెక్నికల్ టీమ్ ను సమకూర్చుకునే పని ఇంకా మొదలుకాలేదు. అది పూర్తయితే సెట్ మీదకు వెళ్తుంది.
ఇదిలా వుంటే దర్శకుడు శ్రీవాస్ కూడా ఓ కథ చెప్పారు. అలాగే హారిక హాసిని వారి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో కూడా కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







