అనసూయ 'కథనం'
- March 10, 2019
అనసూయ నటిస్తున్న చిత్రం 'కథనం'. ఈ సినిమా టీజర్‌ను రామ్‌చరణ్ సతీమణి ఉపాసన విడుదల చేశారు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. "కథ నచ్చి నిర్మిస్తున్నట్టు" నిర్మాతలు తెలిపారు. "అనసూయ పూర్తిస్థాయి పాత్రని చేస్తున్నట్టు వెల్లడించారు. ఆమె కెరీర్‌లో ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ "తన నటనతో అనసూయ మెప్పిస్తారు. కథనంతో హ్యాట్రిక్ కొడతారు. పాట మినహా చిత్రీకరణ పూర్తిచేశాం" అని చెప్పారు.అనసూయ, అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







