ఒక్కటైన ఆర్య, సాయేషా
- March 12, 2019
తమిళ హీరో, హీరోయిన్లు ఆర్య, సాయేషా సైగల్ పెళ్లి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. మార్చి 9, 10 తేదీల్లో జరిగిన ఈ వేడుకకు భారీగా సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఈ వివాహంలో నూతన వధూవరులు చేసిన హంగామా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంగీత్ కార్యక్రమంలో ఆర్య, సాయేషా చేసిన హంగామా గురించి..
సంగీత్‌లో ఆర్య, సాయేషా హంగామా
పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్ కార్యక్రమం కోసం ఆర్య, సాయేషా అందంగా ముస్తాబయ్యారు. అతిథులతో కలిసి పాటలకు క్రేజీగా స్టెప్పులు వేశారు. నూతన వధూవరుల డ్యాన్సులు చేసి గెస్టులకు మతిపోయినంత పనైంది.
రౌడీ బేబీ పాటకు అదిరిపోయే స్పెప్పులు
ఇటీవల సంగీత అభిమానులను ఊర్రూతలూగిస్తున్న రౌడీ బేబీ పాటకు ఆర్య, సాయేషా కలిసి డ్యాన్సు చేశారు. మారి2 చిత్రంలో ధనుష్, సాయిపల్లవి వేసిన స్టెప్పులు ఎంత ప్రజాదరణ పొందాయో అనే విషయం తెలిసిందే. సినిమాలోని పాటకు ధీటుగా స్పెప్పులతో ఆలరించారు. ఇద్ షెరీన్ పాడిన షేప్ ఆఫ్ యూ పాటకు వేసిన డాన్స్ మరింత ఆకట్టుకొన్నది.
సూర్య, కార్తీ, అల్లు అర్జున్ హాజరు
ఆర్య, సాయేషా పెళ్లికి బాలీవుడ్, దక్షిణాది అగ్రనటులు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి సంజయ్ దత్, ఆదిత్య, సూరజ్ పంచోలి, తమిళ పరిశ్రమకు చెందిన సూర్య, కార్తీ సోదరులు మరికొందరు ప్రముఖులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్కరే పెళ్లికి హాజరైనట్టు మీడియాలో కనిపించింది.
షూటింగ్‌లో ప్రేమలో పడిన జంట
ఆర్య, సాయేషా తొలిసారి గజినికాంత్ చిత్రంలో కలిసి నటించారు. ఆ చిత్ర షూటింగ్‌లోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్‌లో మార్చి 9, 10 తేదీల్లో వివాహానిక ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!