తారక్ సరసన హాలీవుడ్ బ్యూటీ..
- March 15, 2019
జక్కన్న చెక్కిన శిల్పాల లిస్టులో జాయినవుతోంది హాలీవుడ్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్. తన ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ సరసన హీరోయిన్గా బ్రిటీష్ నటిని ఎంపిక చేశాడు. ఇంతకీ రాజమౌళి ఆమెలో ఏం చూసి సెలక్ట్ చేశాడో అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్లో డైసీ పేరు వినిపించగానే సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. డైసీ ఎడ్గార్ జోన్స్ బ్రిటీష్‌లోని మస్వెల్ హిల్స్ ప్రాంతానికి చెందిన డ్రామా ఆర్టిస్ట్. ద మౌంట్ స్కూల్ ఫర్ గాళ్స్ లో చదువుకుంది. అక్కడినుంచి ప్రతిష్టాత్మక నేషనల్ యూత్ థియేటర్ నుంచి ఎడ్గర్ నటనకు సంబంధించిన కోర్సులు చేసింది. అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని కాచి వడబోసి ఎంపిక చేసుకుంటుంది ఈ థియేటర్.
తరువాత ఆమె కొన్ని టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్ వంటి టీవీ సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాండ్లైఫ్ అనే ఆంగ్ల చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రని పోషించింది.
1997లో మోస్ట్ పాపులర్ అయిన కోల్డ్ ఫీట్ టీవీ షోకు ఎడ్గర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. టీవీ షో రేటింగ్స్ కూడా అమాంతం పెరిగాయి. ఈ షోలో ఒలివియా అనే సాధారణ యువతి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందంతో పాటు అద్భుత నటను ప్రదర్శించిన ఈ టీవీ షో ఎడ్గర్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.
మరి అలాంటి స్కూల్లో జాయిన్ అయిన తరువాత ఆమె నటనకు తిరుగేముంటుంది. అందుకే జక్కన్న ఆమెకు ఓటేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఇండియన్ సినిమాలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఎడ్గర్‌ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..