ఫ్లైట్ ఎస్కార్ట్స్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం
- March 15, 2019
విమానాల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి) ఏర్పాటు చేసిన ఎస్కార్ట్స్ ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాజాగా హైద్రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో బారీ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌ని అధికారులు భగ్నం చేశారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఆర్జిఐఏతోపాటు ఎస్కార్ట్ టీమ్స్ విమానాల్లో మోహరించి, ప్రయాణీకుల్ని పరిశీలిస్తారు. ప్రత్యేకించి దుబాయ్ నుంచి వచ్చేవారి పట్ల ఈ ఎస్కార్ట్స్ అప్రమత్తంగా వ్యవహరిస్తారు. బ్యాగ్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకునేవారిపై దృష్టిపెట్టి, అదుపులోకి తీసుకుంటున్నారు. కస్టమ్స్ కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్కార్ట్స్ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తారని చెప్పారు. కొత్త ఎస్కార్ట్స్ విధానం సత్ఫలితాలనిస్తోందనీ, స్మగ్లింగ్ రాకెట్స్‌ని భగ్నం చేయగలుగుతున్నామనీ ఎస్కార్ట్స్ కళ్ళు గప్పి తప్పించుకోవడం అసాధ్యమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..