దుబాయ్:రాజకుటుంబాన్నిమోసం చేసిన భారతీయ పూజారి అరెస్ట్..!
- March 15, 2019
దుబాయ్:దుబాయ్ లో ఒక భారతీయ పూజారి నాసిక్ కాలారామ్ ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్ సుధీర్ దాస్ పూజారి ను దుబాయ్ నుంచి ఇండియా వెళ్తుండగా విమానాశ్రయం లో అరెస్ట్ చేసారు.పూజారి ఒక రాజకుటుంబ సభ్యుడ్ని మోసం చేశారన్న ఆరోపణలతో దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అరెస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సుధీర్ దాస్ బెయిల్ కోసం సహకరించినట్టు దుబాయ్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ ప్రకటించింది. సుధీర్ దాస్ బెయిల్‌పై బయటకు వచ్చినా ఆయన పాస్‌పోర్టును మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కానీ, తన పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నానని, ప్రస్తుతం షార్జాలో ఉన్నానని నాసిక్‌లోని తన సన్నిహితులకు పూజారీ చెప్పడం విశేషం. అర్చకుడి వ్యవహారంలో సహాయం చేయాలని విదేశాంగ శాఖకు నాసిక్ MP మరియు MLA లు లేఖ రాశారు.దుబాయ్ అధికారులతో మాట్లాడి సుధీర్ పాస్‌పోర్ట్ ఇప్పించడానికి చర్యలు తీసుకుని, స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇటీవలే ముంబయి నుంచి దుబాయ్‌కు తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన సుధీర్ దాస్, అక్కడ పలు సంస్థలను ప్రారంభించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









