జెలసీ: వర్క్‌ మేట్‌పై హౌస్‌ మెయిడ్‌ దాడి

జెలసీ: వర్క్‌ మేట్‌పై హౌస్‌ మెయిడ్‌ దాడి

బహ్రెయిన్: ఆసియాకి చెందిన ఓ మెయిడ్‌, తన స్పాన్సరర్‌ వద్ద పనిచేస్తోన్న మరో మెయిడ్‌పై దాడికి పాల్పడటం సంచలనం కలిగిస్తోంది. జెలసీ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. విచారణలో నిందితురాలు, తాను తన వర్క్‌ మేట్‌ అయిన మహిళపై పజర్‌ ప్రేయర్‌ చేస్తున్న సమయంలో దాడి చేసినట్లు పేర్కొంది. జెలసీ కారణంగానే తాను దాడి చేసినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. స్పాన్సరర్‌ కుటుంబం ఈ ఘటనపై మాట్లాడుతూ, తాము చూసేసరికి బాధితురాలు రక్తపు మడుగులో పడి వున్నట్లు చెప్పారు. నిందితురాల్ని బద్దకస్తురాలిగా స్పాన్సరర్‌ అభివర్ణించారు. నిందితురాలు తన మీద తాను దాడి చేసుకుని, కేసుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. 

 

Back to Top