వేతనానికీ ఫ్యామిలీ విజిట్‌ వీసాకీ లింక్‌

వేతనానికీ ఫ్యామిలీ విజిట్‌ వీసాకీ లింక్‌

కువైట్‌: వలసదారులు, తమ ఫ్యామిలీ మెంబర్స్‌ని పోషించగలిగేందుకు తగినంత ఆర్థిక స్తోమత కలిగి వున్నారా? లేదా? అన్నదానిపైనే ఫ్యామిలీ విజిట్‌ వీసా ఆధారపడి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ అండర్‌ సెక్రెటరీ - రెసిడెన్సీ ఎఫైర్స్‌ మేజర్‌ జనరల్‌ తలాల్‌ మరాఫి చెప్పారు. 1 నుంచి 3 నెలలకుగాను విజిట్‌ వీసా ఇచ్చేందుకు అవకాశం వుంది. అయితే, ఫ్యామిలీ విజిట్‌ వీసా మాత్రం 1 నెలకు పరిమితం కానుంది. 3 నెలల కాలానికి చెల్లుబాటు అయ్యే విజిట్‌ వీసా యూరోపియన్స్‌ అలాగే రెసిడెంట్‌ వలసదారుల భార్య, కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. అత్యధిక వేతనం వుండేవారికి సులభంగా ఫ్యామిలీ విజిట్‌ వీసా దక్కే అవకాశం వుంటుందని అధికారులు చెబుతున్నారు. 

 

Back to Top