క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సస్పెన్షన్‌

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సస్పెన్షన్‌

యూఏఈలోని బ్యాంకులు, తమ వినియోగదారుల క్రెడిట్‌ మరియు డెబిట్‌ కార్డుల్ని సస్పెడ్‌ చేయడం ప్రారంభించాయి. ఎవరైతే ఎమిరేటీ ఐడీని అప్‌డేట్‌ చేసుకోలేదో అలాంటివారి కార్డుల్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. యూఈఏ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నాయి. ఎడిసిబి, రస్‌ అల్‌ ఖైమా బ్యాంక్‌, ఎమిరేట్స్‌ ఎన్‌బిడి మరియు సిబిఐ మరికొన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు ఎమిరేటీ ఐడీని అప్‌డేట్‌ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. వినియోగదారులు తమ డిటెయిల్స్‌ అప్‌డేట్‌ చేసుకునేవరకు ఆయా కార్డులు సస్పెన్షన్‌ మోడ్‌లో వుంటాయి. 

 

Back to Top