బెల్లో ఉద్యోగ అవకాశాలు
- March 22, 2019
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎంబెడెడ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పోస్టుల వివరాలు..
ఎంబెడెడ్ ఇంజనీర్: 05 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్). జనరల్ అభ్యర్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పాసయితే చాలు.
వయసు: 31.03.2019 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ లకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు
వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నింపాలి. దరఖాస్తుకు అవసరమైన అన్ని పత్రాలను జత చేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఏమైనా సందేహాలు ఉంటే [email protected] చిరునామాకు మెయిల్ చేయవచ్చు.
పే స్కేలు: రూ.50,000 – 1,60,000/-
చివరి తేదీ: 10.04.2019
చిరునామా:
Sr Dy General Manager (HR)
Bharat Electronics Limited
I.E.Nacharam,
Hyderabad- 500076
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..