డబల్ రోల్ లో కనిపించనున్న కీర్తి
- March 25, 2019
మహానటి చిత్రంతో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి..ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా హిట్స్ కాలేకపోయాయి. అయినాగానీ అమ్మడికి ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ ఆఫర్ కూడా ఒకటి. ఫుట్ బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో కనిపిస్తుండగా.. అతని భార్యగా కీర్తి నటించనుంది. కథ ప్రకారం సినిమాలో కీర్తి డబుల్ రోల్ ప్లే చేస్తోందట. అందులోఒకటి మధ్యవయస్కురాలి పాత్ర..మరోటి యంగ్ గా కనిపిస్తుందట. మధ్యవయస్కురాలి పాత్ర కోసం టీమ్ ఆమెకు ప్రత్యేకమైన మేకప్ వేయనున్నట్లు సమాచారం. 1953 నుంచి 1963 వరకు ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు అబ్దుల్ రహీం అనే వ్యక్తి కోచ్ గా పనిచేశారు. ఆయన జీవితం ఆధారంగా అమిత్ శర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బోనికపూర్, ఆకాష్ చావ్లా, అరణవ సేన్ గుప్తాలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







