మజిలీ: వీడియో సాంగ్ టీజర్ విడుదల

- March 26, 2019 , by Maagulf
మజిలీ: వీడియో సాంగ్ టీజర్ విడుదల

నాగచైతన్య, సమంత ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం మజిలి. ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పలు సాంగ్స్ విడుదల చేసిన టీం తాజాగా మాయ మాయ సాంగ్‌కి సంబంధించి వీడియో టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో చైతూ చాలా జోష్‌లో కనిపించాడు. భాస్కర బట్ల ఈ సాంగ్‌కి లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గోపి సుందర్ సంగీత సారధ్యం వహించారు. ఈ సాంగ్ సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది. మజిలీ చిత్రంలో దివ్యాంష కౌశిక్ మరో హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com