ఎంప్లాయీ సర్టిఫికెట్స్‌ ఫేక్‌ కాదని ఎన్‌ష్యూర్‌ చెయ్యాల్సిందే

- March 26, 2019 , by Maagulf
ఎంప్లాయీ సర్టిఫికెట్స్‌ ఫేక్‌ కాదని ఎన్‌ష్యూర్‌ చెయ్యాల్సిందే

మస్కట్‌: ఒమన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నఅండ్‌ ఇండస్ట్రీ తాజాగా ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా ఎంప్లాయీ సర్టిఫికెట్స్‌ని కంపెనీలు అక్రెడిట్‌ చేయాలని ఈ సర్కుల్యర్‌లో పేర్కొన్నారు. ఓసిసిఐ జారీ చేసిన స్టేట్‌మెంట్‌ ప్రకారం, ప్రైవేట్‌ సెక్టార్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ మరియు కంపెనీలు, సుల్తానేట్‌ బయట విద్యనభ్యసించిన తమ ఎంప్లాయీస్‌ అలాగే స్టూడెంట్స్‌ అక్రిడేషన్‌ తప్పకుండా చేయించుకోవాల్సి వుంటుంది. ఇప్పటికే చేసుకున్నవారికి ఈ విషయమై ఎలాంటి సమస్యా లేదు. అయితే చేయించుకోనివారి విషయంలో మాత్రం తప్పనిసరిగా ఇకపై ఆ అక్రిడేషన్‌ చేయించాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో అక్రిడేషన్‌ జరుగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com