ఓ ముస్లిం భక్తుడు శ్రీవారికి 30లక్షల వితరణ

- December 30, 2015 , by Maagulf
ఓ ముస్లిం భక్తుడు శ్రీవారికి 30లక్షల వితరణ

 మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది ఈఘటన. చెన్నైకి చెందిన ఓ ముస్లిం భక్తుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి కూరగాయల రథాన్ని వితరణ చేశారు. అబ్దుల్‌ గనీ అనే భక్తుడు రూ.30లక్షల విలువైన రథాన్ని తయారు చేయించి శ్రీవారి ఆలయం ఎదుటకు తీసుకొచ్చారు. రథానికి పూజలు నిర్వహించి దేవస్థానం రవాణాశాఖకు స్వాధీనం చేశారు. ఈ సందర్భంగాదాత అబ్దుల్‌ గనీని... తితిదే డిప్యూటీ ఈవో చెన్నంగారి రమణ తదితరులు సత్కరించారు. అబ్దుల్‌ గనీ గతంలో తిరుమల అశ్వనీ ఆసుపత్రికి వైద్య పరికరాలు వితరణగా అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com