మహిళల స్పేస్‌వాక్ రద్దు..సరైన స్పేస్‌సూట్ లేకపోవడమే కారణమన్న నాసా
- March 27, 2019
వాషింగ్టన్: పురుషుల తోడు లేకుండా ఇద్దరు మహిళలు అంతరిక్షంలో నడిచి (స్పేస్‌వాక్) చరిత్ర సృష్టించాలనుకున్నారు. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఎదురైన ఓ అనూహ్య అవాంతరంతో ఈ ఘటన ను వాయిదా వేశారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరికి స్పేస్ వాక్కు అవసరమైన దుస్తులు లేవని నాసా తెలిపింది. ఐఎస్ఎస్కు ఉన్న సౌర శ్రేణుల్లో ఒకదానికి లిథియం-ఐయాన్ బ్యాటరీలను అమర్చడానికి ఆనీ మెక్‌క్లెయిన్, క్రిస్టినా కోచ్ అనే మహిళా వ్యోమగాములు ఈ నెల 29న స్పేస్‌వాక్ చేయాలి. అంతరిక్ష కేంద్రంలో అందుబాటులో ఉన్న పరికరాల తో ఈ నెల 29కల్లా ఒక్క మీడియం సైజ్ టా ర్సో మాత్రమే సిద్ధమయ్యే అవకాశముందని, దానిని క్రిస్టినా కోచ్ మాత్రమే ధరించవచ్చని నాసా తెలిపింది. దీంతో ఏప్రిల్ 8న కెనడా వ్యోమగామి డేవిడ్ సెయింట్ జాక్విస్తో మెక్‌క్లెయిన్ స్పేస్ వాక్ చేస్తారని నాసా పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..