అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధం అంటూ సంచలన ప్రకటన చేసిన మోడీ
- March 27, 2019
ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. అంతరిక్ష యుద్ధం చేయగల సత్తా భారత్ సంపాదించినట్లు ప్రకటించారు. దేశ ప్రజల భద్రత విషయంలో భారత్ మరో ముందడుగు వేసిందని వెల్లడించారు. భారత్ ఇప్పుడు మహాశక్తిగా అవతరించిందని.. శాటిలైట్లను కూల్చగల సామర్ధ్యం సాధించినట్లు ప్రకటించి దేశ ప్రజలను నివ్వెరపరిచారు.
అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధం అని.. ఆ సత్తాను సాధించగలిగిందని ప్రకటించారు. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే సాధించిన ఘనతను భారత్ కూడా సాధించిందని గర్వంగా ప్రకటించారు ప్రధాని మోడీ. మిషన్ శక్తిలో భాగంగా అంతరిక్షంలో ఓ శాటిలైట్‌ను కూల్చివేశామని.. ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ భారతీయుడూ గర్వించదగ్గ అంశంగా అభివర్ణించారు.
అంతరిక్షంలో.. భూమికి 3వేల కిలోమీటర్ల ఎత్తులో.. లోయర్ స్పేస్‌లో ఏ-శాట్ (యాంటీ శాటిలైట్)ను మిసైల్ ద్వారా కూల్చివేశారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలో మిషన్ శక్తి కంప్లీట్ అయ్యింది. ఈ ఆపరేషన్ విజయవంతం అయిందని, 'మిషన్ శక్తి' పేరిట ఇది జరిగిందని తెలిపారు. ఇకపై ఎలాంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల శక్తి ఇండియాకు వచ్చినట్టేనని అన్నారు. స్పేస్ పవర్ దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా సూపర్ పవర్ గా మారిందని మోడీ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







