అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమాలో ఏఆర్ఆర్ మ్యూజిక్

- March 27, 2019 , by Maagulf
అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమాలో ఏఆర్ఆర్ మ్యూజిక్

హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్‌లో హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్‌గేమ్ రిలీజ్ కానున్నది. అయితే ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా కోసం ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అవెంజర్స్ అభిమానల కోసం రెహ్మాన్ ఓ స్పూర్తినిచ్చే పాటను కంపోజ్ చేస్తున్నట్లు మార్వెల్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొన్నది. అయితే ఆ ట్రాక్‌ను హిందీ, తమిళ్‌, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీన ఆ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. తన మ్యూజిక్‌ను మార్వెల్ అభిమానులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు రెహ్మాన్ ఓ ప్రకటనలో చెప్పాడు. ఏప్రిల్ 26వ తేదీన విశ్వవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com