డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు రేపటితో..
- March 28, 2019
బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆహ్వానం పలుకుతోంది. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తేదీ: 2019 మార్చి 8
దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ: 2019 మార్చి 29
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ : 96 పోస్టులు
వయసు: 25 నుంచి 40 ఏళ్లు
టెర్రిటరీ హెడ్: 4 పోస్టులు 35 నుంచి 45 ఏళ్లు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయసులో సడలింపు ఉంటుంది.
అర్హత: ఈ రెండు పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 2019 మార్చి 29 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారు ఆన్లైన్ అప్లికేషన్ను ప్రింటవుట్ తీసి భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం దగ్గర ఉంచుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.600 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100లు చెల్లిస్తే సరిపోతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..