వీరి ప్రేమ, వివాహం మూన్నాళ్ళ ముచ్చటగా మిగులుతుందా?

- March 31, 2019 , by Maagulf
వీరి ప్రేమ, వివాహం మూన్నాళ్ళ ముచ్చటగా మిగులుతుందా?

బాలీవుడ్‌లో దీపికా, రణ్వీర్ పెళ్లి తరువాత అందరి దృష్టిని ఆకర్షించిన సెలబ్రిటీ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్. వయసులో తన కన్నా పదేళ్లు చిన్న వాడైన హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను ప్రియాంక గతేడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే పెళ్లయి సంవత్సరం కూడా కాలేదు. కానీ అప్పుడే 'ఓకే!' అనే ఆంగ్ల మ్యాగ్‌జైన్‌ వీరు విడాకులు తీసుకోబుతున్నారంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ మ్యాగజైన్ కథనం ప్రకారం. "నిక్‌యాంకలకు ఒకరి గురించి ఒకరికి ఇప్పుడే పూర్తిగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. ఈ మధ్య ప్రియాంక డామినేషన్‌ పెరిగిపోయింది. ఆమెకు కోపం కూడా ఎక్కువే. కానీ ఈ విషయం పెళ్లి తర్వాతే నిక్ కి తెలిసింది" అని ప్రచురించింది.

అంతేకాక.. "నిక్‌ కుటుంబ సభ్యులు కూడా ప్రియాంక వివాహం తర్వాత సినిమాలను వదిలేసి, పిల్లాపాపలతో సెటిలవుతుందని అనుకున్నారు. కానీ ప్రియాంక ఇప్పుడు మళ్ళీ సినిమాలవైపే మళ్లడం నిక్‌ కుటుంబ సభ్యులకు నచ్చడం లేదు. దాంతో వారు నిక్‌ను విడాకులు తీసుకోమని కోరుతున్నారట. కొద్ది రోజుల పరిచయంతోనే వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు" అని ఆ కథ సారాంశం. అయితే ఈ వార్తలపై ఇంతవరకూ నిక్-ప్రియాంక దంపతులు స్పందించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com