తొలి సౌదీ హాక్‌ జెట్‌ ట్రెయినింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంఛ్‌

- April 01, 2019 , by Maagulf
తొలి సౌదీ హాక్‌ జెట్‌ ట్రెయినింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంఛ్‌

దహ్రాన్‌: సౌదీ అరేబియా, తొలిసారిగా స్థానిక తయారీ హాక్‌ జెట్‌ ట్రెయినింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ని లాంఛ్‌ చేసింది. దీనికి సంబంధించి కొన్ని విడి భాగాలు సౌదీ అరేబియాలోని స్థానిక కంపెనీలు తయారు చేయడం జరిగింది. క్రౌన్‌ ఇపన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, ఈ ప్లేన్‌ని కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఎయిర్‌ బేస్‌లో ప్రారంభించారు. పలువురు ప్రిన్స్‌లు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బ్రిటిష్‌ - సౌదీ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కోసం పనిచేసినవారిలో 70 శాతం మంది సౌదీ యువకులే. పలు రకాలైన పరీక్షలు ఈ ఎయిర్‌ క్రాఫ్ట్‌కి నిర్వహించగా, అన్నిటిలోనూ విజయం సాధించింది. క్రౌన్‌ ప్రిన్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంత ఈ విమానం గాల్లోకి తొలిసారిగా ఎగిరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com