గంటకు 264 కిలోమీటర్ల వేగం: డ్రైవర్ పట్టివేత
- April 01, 2019ఎమిరేట్స్ రోడ్డుపై గంటకు 264 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న ఓ కారుని పోలీసులు అడ్డుకున్నారు, డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు డ్రైవర్లను కూడా ఈ సందర్భంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీరంతా తమ వాహనాల్ని నడుపుతున్నారని అధికారులు పేర్కొన్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి మాట్లాడుతూ, ఫిక్స్డ్ అలాగే మొబైల్ రాడార్ల ద్వారా అతి వేగంతో దూసుకెళ్ళే వాహనాల్ని పసిగట్టగలమని చెప్పారు. అరెస్టయినవారిలో అత్యధిక వేగంతో వెళుతున్న యువకుడి కారు వేగం గంటకు 264 కీలోమీటర్లుగా రిజిస్టర్ అయ్యింది. మిగతావారి వేగం 247, 244, 243, 232 అలాగే 222 కిలోమీటర్ల వేగం గంటకు నమోదయ్యింది. ఇంత వేగంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగేందుకు కారణమవుతున్నారు వాహనదారులు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..