కిడ్నీలతో వ్యాపారం..
- April 02, 2019
రాచకొండ:కిడ్నీ. శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. అయితే దీన్ని అంగడి సరుకుగా మార్చేసారు కొందరు కేటుగాళ్లు. ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో కిడ్నీల బిజినెస్ చేస్తున్నారు. అయితే కిడ్నీ ఇచ్చినా, ఒప్పందం ప్రకారం డబ్బులివ్వకపోవడంతో ఓ బాధితుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. వారి తీగలాగడంతో ఈ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది.
ఇప్పటికే రకరకాల మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు, ఏకంగా మానవ అవయవాలతో వ్యాపారం చేసేందుకు తెగించేశారు. శరీరంలో అత్యంత ముఖ్యమైన కిడ్నీ మార్పిడి దందాకు తెరతీశారు. తొలుత సోషల్ మీడియాలో కిడ్నీ దాతలు కావాలని ప్రకటన ఇస్తారు. పేదరికంతో కిడ్నీ అమ్మడానికి రెడీ అయిన వారిని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి టర్కీ తీసుకెళ్తారు. అక్కడ ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకుంటారు. అయితే కిడ్నీని తీసుకున్నాక దాతకు అనుకున్న ప్రకారం డబ్బులివ్వడం లేదు. అడిగితే చంపేస్తామని బెదిరిస్తారు. దీంతో బాధితులు తమ బాధను ఎవ్వరితో చెప్పుకోలేక విలవిలలాడుతుంటారు. ఇలా అమాయకులను దగా చేస్తూ… కిడ్నీలతో భారీగా సంపాదిస్తుందో ముఠా.
ఇటీవల కిడ్నీ అమ్మకానికి సిద్ధపడ్డ ఓ వ్యక్తిని వైద్య పరీక్షలు పూర్తయ్యాక టర్కీ తీసుకెళ్లారు. ఒప్పందం ప్రకారం అతనికి 20 లక్షలు ఇవ్వాలి. కానీ ఆ ముఠా కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుసేకుంది. దీంతో బాధితుడు రాచకొండ పోలీసులను అశ్రయించాడు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేయడంతో అంతర్జాతీయా కిడ్నీ మాఫియా గుట్టు రట్టయింది. ప్రధాన నిందితుడు అమ్రిష్ ప్రతాప్ తో పాటూ ఆయనకు సహకరించిన సందీప్ ,రిథికాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుంచి ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు, ఫోర్జరీ డాక్యూమెంట్లు, క్రిడిట్ డెబిట్ కార్డులు, పలు పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.
కేటుగాళ్లు 2013 నుంచి పదుల సంఖ్యలో కిడ్నీ మార్పిడిలు చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారు. టెక్నాలజీ విరివిగా వాడుతున్న కేటుగాళ్లు తమ వెబ్ సైట్ లో కంట్రీ వైజ్ గా డోనర్లు …రిసీవర్ల వివరాలు అప్ లోడ్ చేస్తున్నారని పోలీసుల విచారణలో బయటప డింది.
కిడ్నీ రాకెట్‌లో కొంతమంది అంతర్జాతీయ స్థాయి వైద్యుల ప్రమేయం ఉన్నట్లు రాచకొండ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను సహకరించిన వీరిని పట్టుకోవడానికి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..