యూ.ఏ.ఈ:విజిటింగ్ వీసాలతో మోసం
- April 02, 2019
దుబాయ్:ఏజెంట్ల మాయ మాటలు నమ్మి విజిటింగ్ వీసాలతో మహిళలు దుబాయ్ రావొద్దని కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు హెచ్చరిస్తున్నారు. విజిటింగ్ వీసాలతో దుబాయ్ వచ్చిన మహిళలను కొంతమంది ఏజెంట్లు మోసం చేస్తున్నారన్నారు. ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, దుబాయ్‌లో అరబ్ షేక్‌ల ఇంట్లో పనిమనుషులుగా చేర్పిస్తున్నారని వారన్నారు. ఇంట్లో పనిమనుషులుగా కుదిరిన తర్వాత ఆ మహిళల పాస్‌పోర్టు, మొబైల్ ఫోన్లను యజమానులు, ఏజెంట్లే లాగేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. పాస్‌పోర్టు, సరైన వీసా పత్రాలు లేకుండా పోలీసులకు చిక్కితే అరెస్ట్ చేస్తారన్నారు. ఇదిలావుండగా కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి యేటా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరబ్ షేక్‌ల ఇంట్లో సరైన వీసా పత్రాలు లేకుండా పనిమనుషులుగా ఉన్నవారిని రక్షించి స్వదేశానికి పంపిస్తున్నారు. 2016లో 84 మంది మహిళలను, 2017లో 121 మంది మహిళలను, 2018లో 134 మంది మహిళలను భారత్ పంపించామని కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా విపుల్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..