'Mr ప్రేమికుడు' ఫస్ట్‌లుక్ విడుదల

- April 02, 2019 , by Maagulf
'Mr ప్రేమికుడు' ఫస్ట్‌లుక్ విడుదల

డాన్స్‌తో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా స్థిరపడిన ప్రభుదేవాకు హీరోగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం 'ప్రేమికుడు'. శంకర్ దర్శకత్వంలో తమిళంలో 'కాదలన్'గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'ప్రేమికుడు'గా అనువాదమైంది. ఆ సినిమా విడుదలైన సుమారు రెండున్నర దశాబ్దాల తరవాత మళ్లీ ఇంచుమించుగా అదే టైటిల్‌తో ప్రభుదేవా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. కాకపోతే ఇప్పుడు 'ప్రేమికుడు'కి ముందు మిస్టర్ జత చేస్తున్నారు. సోమవారం (ఏప్రిల్ 1, 2019)న 'Mr ప్రేమికుడు' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసారు.

ప్రభుదేవా, అదాశర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'చార్లీ చాప్లిన్'. ఈ చిత్రాన్ని శ్రీ తారకరామా పిక్చర్స్ పతాకంపై ఎమ్.వి. కృష్ణ సమర్పణలో వి.శ్రీనివాసరావు తెలుగులోకి 'Mr ప్రేమికుడు' పేరుతో అనువదిస్తున్నారు.

తమిళంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం తెలుగు అనువాద కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెలలోనే సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి చూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com