హైదరాబాద్ లో బీదర్ కోట..

- April 03, 2019 , by Maagulf
హైదరాబాద్ లో బీదర్ కోట..

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథతో సైరా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఈచిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే అనేక లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపారు. ఉయ్యాలవాడ జీవితంలోని కీలక ఘట్టాల్లో బీదర్‌ కోట ఒకటి. దీనికి సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం కోకాపేటలో బీదర్‌ కోట సెట్‌ వేశారు. ఇందులో చిరంజీవితో పాటుగా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ నెలాఖరుతో సినిమా చిత్రీకరణ పూర్తిచేస్తారు. ఆ తర్వాత విఎఫ్‌ఎక్స్‌ పనులు ప్రారంభిస్తారు. ఇందులో నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా కీలక పాత్రధారులు. అమిత్‌ త్రివేది స్వరరచన చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ ఈ చిత్రానికి నిర్మాత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com