తండ్రి శవంతో కారులో 2500 కి.మీ ప్రయాణం..

- April 03, 2019 , by Maagulf
తండ్రి శవంతో కారులో 2500 కి.మీ ప్రయాణం..

ఫ్లోరిడా:ఓ కుటుంబం సరదా కోసం విహారయాత్రకు వెళ్లితే అది కాస్త విషాదంతమైంది. ఆ యాత్ర అనుకోని మలుపు తిరిగింది. క్యూబెక్‌లో ఉండే లూయిస్ అనే వ్యక్తి.. భార్యతో కలిసి ఫ్లోరిడాలో ఉన్న ఉన్న పర్యాటక ప్రాంతాలను చూడడానికి బయలుదేరాడు. అలాగే ఇంట్లో ఉన్న 87 తండ్రి కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ముగ్గురు కలిసి కారులో బయలుదేరారు. ఫ్లోరిడా వచ్చిన ఆ కుటుంబం కొంతసేపు నగరంలో విహరించింది. అనంతరం ముగ్గురు కలిసి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కొడుకు, కోడలితో సరదాగా మాట్లాడుతున్న ఫెర్నాండ్.. ఒక్కసారిగా పక్కకు పడిపోయాడు. దీంతో లూయిస్ కారు ఆపి వెనుక సీట్లో కూర్చున్న తండ్రిని లేపాడు. అయితే అప్పటికే పెర్నాండ్ విగత జీవిగా మారాడు. తండ్రి గుండె నొప్పితో చనిపోయాడని నిర్దారించుకున్న లూయిస్ తండ్రి శవంతోనే కారులో ఇంటికి బయలుదేరాడు.

 
కెనడా సరిహద్దు వద్ద బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ వారి కారు అడ్డగించి చెక్ చేశారు. లోపల కూర్చున్న ఫెర్నాండ్ మరణించినట్లు తెలుసుకొని.. లూయిస్, అతని భార్యను అదుపులోకి తీసుకొన్నారు. అసలు విషయం లూయిస్ వారికి చెప్పడంతో అర్థం చేసుకున్న సిబ్బంది ఫెర్నాండ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. శవ నివేదికలో అతనిది సహజ మరణమే అనే తేలడంతో తండ్రి శవాన్ని లూయిస్‌కు అప్పగించారు. ఫ్లోరిడా నుంచి క్యూబెకు దాదాపు 2500 కిలోమీటర్లు తండ్రి శవంతోనే కారులోనే వెళ్లారు. చివరి ప్రయత్నంగా తండ్రిని ఏదైనా ఆస్పత్రిలో చేరిపించే చూసి ఉండవచ్చు కదా అని బంధువులుగా లూయిస్ అడిగారు. ఫ్లోరిడా ఆస్పత్రుల్లో అడిగే ఫీజు తాము కట్టలేమని, అందుకే తమ స్వదేశానికి తిరిగి వచ్చామని లూయిస్ చెప్పుకోచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com