పుస్తకంలో పెట్టి మర్చిపోయిన లాటరీకి రూ.5 కోట్ల 14 లక్షలు..
- April 04, 2019
కెనడా:ఏదో అందరూ కొంటున్నారని వాళ్లూ కొన్నారు. ఇంటికి వెళ్లాక ఎక్కడో పెట్టి ఆ విషయాన్నే మరచి పోయారు. తీరా చూస్తే అదే టికెట్ కోట్ల రూపాయలు తెచ్చి పెట్టింది.
కెనడాకు చెందిన ఓ జంట లాటరీ టికెట్ కొని దాని గురించి పట్టించుకోకుండా మనవడి స్కూలు పుస్తకాల షెల్ఫ్‌లో పెట్టారు. ఓ రోజు వాడేదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని దానికి సంబంధించిన పుస్తకాల కోసం షెల్ఫ్‌లో వెతుకుతున్నాడు. అక్కడ లాటరీ టికెట్ కనిపించింది. అది తీస్కెళ్లి తాతకి ఇచ్చాడు. దాంతో తాత ఎప్పుడో కొన్నాం రా ఇది.
ఇంకా టైమ్ వుందో లేదోనని ఓ సారి చెక్ చేయమంటూ కొడుక్కి ఆ టికెట్ ఇచ్చారు. లాటరీ వెబ్ సైట్లో చెక్ చేయగా ఇంకా రెండు రోజులే టైమ్ ఉంది. ఇంతకీ లాటరీ తగిలిందో లేదో అని చూసుకుంటే.. 10 లక్షల డాలర్లు (రూ.5 కోట్ల 14 లక్షలు) లాటరీ తగిలినట్లు తెలుసుకున్నారు. పట్టించుకోకుండా పక్కన పడేసిన లాటరీ టికెట్‌కి అంత ప్రైజ్ మనీ వచ్చే సరికి మనవడిని ముద్దులతో ముంచెత్తారు తాతగారు. నీ వల్లే రా మనవడా ఈ రోజు మనం కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!