హైదరాబాద్: మెట్రో సేవలకు అంతరాయం
- April 05, 2019
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు కాసేపు అంతరాయం కలిగింది. రైల్వే ట్రాక్‌లపై ఫ్లెక్సీలు పడడంతో మెట్రో ట్రైన్లను కొద్దిసేపు నిలిపేశారు. ఫలితంగా హైటెక్‌సిటీకి వెళ్లే దారిలో మెట్రో ట్రైన్లు కాసేపు ఆగిపోయాయి. ఈ సాయంత్రం భాగ్య నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు విపరీతమైన ఎండతో అల్లాడిపోగా, అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది. ఉరుములు-మెరుపులతో వర్షం పడింది. ఈదురుగాలులు వీశాయి. ఆ గాలుల ధాటికి ఫ్లెక్సీలు తెగి రైల్వే ట్రాక్‌లపై పడిపోయాయి. దాంతో ఆ మార్గంలో ట్రైన్ సర్వీసులను ఆపేశారు. ట్రాక్‌లపై నుంచి ఫ్లెక్సీలను తొలగించిన తర్వాత మళ్లీ మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..